తొలిచూపులోనే నిజమైన, నిస్సందేహమైన ప్రేమను మీరు అనుభవించిన ఆ సమయం గుర్తుందా? తల్లిదండ్రులుగా మీ ముద్దుల బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు మీ హృదయాలను నింపిన ఆ భావోద్వేగాల వెల్లువ!! మీ చిన్నారిని చూసిన ప్రతిసారీ ఆ అనుభూతి మీకు పదే పదే కలగడం లేదా? అవును, వారు ఎంత పెద్దవారైనా సరే, మీ హృదయాలు అవే ప్రేమతో, అవే భావోద్వేగాలతో ఉప్పొంగుతాయి.